ప్రత్యేక వలస కార్మికులకు పంపిణీ చేసేందుకు ప్రతి రాష్ట్రానికి కేటాయించే సిలిండర్ల సంఖ్యను కేంద్రం రెట్టింపు చేసింది. 5 కేజీల ఎఫ్టీఎల్(ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 2 నుంచి 3 వరకు అందించిన రోజువారీ సరఫరా ఆధారంగా పెరుగుదల ఉంటుందని, ఆయా రాష్ట్రాల పౌరసరఫరాల శాఖలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. గ్యాస్ కొరతను తగ్గించేందుకు మార్చి 21న 20 శాతం మేర అదనపు కోటాను పెంచి దాన్ని 50% చేసింది. ఎల్పీజీ కొరతతో వలస కార్మికులు నగరాలు విడిచి వెళ్తున్నారనే ప్రచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.