
రాష్ట్రంలో కురుస్తున్న వానల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం తామే స్వయంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లోని ప్రజలకు పునరావాసం, సౌకర్యాలు కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. వర్షాల వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, ఉపాధి కోల్పోయిన లేబర్స్ కు రూ.10 వేల చొప్పున అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి సాయం వచ్చేలా కిషన్ రెడ్డి చూడాలని రేవంత్ కోరారు. వరదల్లో ప్రజల కష్టాలను KCR పట్టించుకోవట్లేదని, సమస్యలను వదిలేసి పార్టీ ఫిరాయింపుల్ని ఎంకరేజ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ప్రియాంక సభ వాయిదా
ఈ నెల 30న కొల్లాపూర్ లో జరగాల్సిన సభను వాయిదా వేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రియాంక గాంధీ అటెండ్ అయ్యే ఈ సభను మరో రోజు నిర్వహిస్తామన్నారు. వర్షాలు, వరదల వల్ల ఈ డిసిషన్ తీసుకున్నామన్నారు.