ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం తప్ప పోలవరం క్రెడిట్ మాకే కావాలన్న ఆశ లేదని ముఖ్యమంత్రి(Chief Minister) వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ వరద సాయం అందాలని, అలా జరగకపోతే కఠిన చర్యలు ఉంటాయని సభా వేదికగా స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో CM పర్యటించారు. తొలుత కూనవరం చేరుకుని ఫ్లడ్ ఎఫెక్టెడ్ బాధితుల్ని పరామర్శించారు. వరద సాయం రాలేదని ఒక్క కంప్లయింట్ కూడా అందలేదన్న జగన్.. ఏ ఒక్కరు మిస్ అయినా చర్యలు తప్పవని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అధికారులు వారం పాటు గ్రామాల్లోనే ఉండి సహాయక చర్యలు చూశారని, బాధితులందరికీ పరిహారం అందేలా యంత్రాంగానికి తగిన సమయమిచ్చి నిత్యావసరాలతోపాటు ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ.10 వేల చొప్పున అందజేశామన్నారు.
పోలవరం నిర్మాణంలో చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారని జగన్ ఫైర్ అయ్యారు. ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీని ట్రాన్స్ పరెన్సీగా నిర్వహిస్తామని CM తెలిపారు.