వాణిజ్య పన్నుల శాఖలో మరిన్ని బదిలీలు జరిగాయి. 24 మంది డిప్యూటీ కమిషనర్లు, 40 మంది అసిస్టెంట్ కమిషనర్లకు పోస్టింగ్ లు, ట్రాన్స్ ఫర్లు కట్టబెడుతూ నిన్న రాత్రి ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరికొందరు CTO(Commercial Tax Officers)లకు స్థాన చలనం కల్పించింది. మొత్తం రెండు మల్టీజోన్ లలో 83 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. మల్టీజోన్-1లో 21 మంది, మల్టీజోన్-2లో 62 మంది బదిలీ అయిన వారిలో ఉన్నారు.
ఎం.సంతోష్ కుమార్ ను మాదాపూర్ నుంచి మాదాపూర్ 8కు.. డి.చంద్రమోహన్ ను చార్మినార్ నుంచి చార్మినార్ డి.సి. ఆఫీసుకు.. అసియా సుల్తానాను వరంగల్ నుంచి వరంగల్ అర్బన్-2కు.. దేవాత్ వెంకట ధనలక్ష్మీని వరంగల్ నుంచి ఖమ్మం-2కు.. జి.మీనాకుమారిని నిజామాబాద్ నుంచి సిద్దిపేటకు బదిలీ చేశారు.