
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మంటల్లో కాలుతున్న మహిళ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఆమెను హత్య చేసి పెట్రోల్ తో నిప్పంటించినట్లు పోలీసులు చెబుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడిందని CC ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో దుర్ఘటన జరిగినట్లు శంషాబాద్ ACP రాంచందర్ రావు తెలిపారు. మహిళ వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని, అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి తప్పిపోయిన వారి డీటెయిల్స్ సేకరిస్తున్నామని ACP తెలియజేశారు. శంషాబాద్ కిషన్ గూడలోని సాయి ఎన్ క్లేవ్ సమీపంలో మృతదేహం కాలిపోతున్నట్లు రాత్రికి సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
మృతదేహంపై గల గుర్తుల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అధికారులు వివరించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయినందున పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి వస్తోందని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన చోట ఇతర ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. బంకుల్లో పెట్రోలు తీసుకున్న ఫుటేజీల్ని పరిశీలించారు. మృతురాలు హైదరాబాద్ సమీప ప్రాంతాలకు చెందిన వ్యక్తా లేదా ఇతర జిల్లాలకు చెందిన మహిళనా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.