
హైదరాబాద్ చందానగర్ గంగారాంలోని JP సినిమా మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు స్క్రీన్లు సహా ఫర్నిచర్ కాలిపోయింది. 3 ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. ఈ షాపింగ్ మాల్ కు పర్మిషన్ లేదని, అక్రమంగా షోలు నడుపుతున్నారని GHMC అధికారులు అంటున్నారు. చందానగర్ మెయిన్ ఏరియాలో ఉన్న మాల్ కు ఫైర్ పర్మిషన్లు లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. నిత్యం వేల మంది వచ్చే థియేటర్లలో NOC లేకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.