
గ్రూప్-2(Group-2) అభ్యర్థుల దీక్షకు మద్దతుగా గన్ పార్క్ వద్ద బైఠాయిస్తామని ప్రకటించిన కోదండరామ్, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఇంటి నుంచి కదలకుండా అర్థరాత్రి నుంచే వారి నివాసాల వద్ద భద్రతను మోహరించారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ కోదండరామ్, ప్రవీణ్.. తమ ఇళ్ల వద్దే దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రూప్-2 వాయిదా(Postpone) వేయాలంటూ పట్టుబడుతున్న అభ్యర్థులు.. ఈ నెల 10న TSPSC కార్యాలయాన్ని పెద్దసంఖ్యలో ముట్టడించారు. దీనికి కోదండరామ్ సహా పలు పార్టీల లీడర్లు మద్దతిచ్చారు. నాంపల్లిలోని TSPSC కార్యాలయం వద్దకు చేరుకుని అభ్యర్థులతోపాటే బైఠాయించారు. వాయిదా నిర్ణయాన్ని ప్రకటించే వరకు ఆందోళన విరమించబోరని కోదండరామ్ స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ముందస్తుగా కోదండరామ్ సహా ప్రవీణ్ కుమార్ ను గృహనిర్బంధం చేశారు.