అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ట్రెయిన్లలో ఫుల్ నిద్రలో ఉన్న సమయంలో ఉన్నట్టుండి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. రెండు రైళ్లలో ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. APలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ, కావలి మధ్య ఈ దోపిడీ జరిగినట్లు గుర్తించారు. సికింద్రాబాద్ నుంచి చెన్నె వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ చోటుచేసుకుంది. S2, S4, S5, S6, S7, S8 బోగీల్లో దుండగులు సొమ్మును దోచుకుపోయారు. అటు మరో ట్రెయిన్ సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ S1, S2 కోచ్ ల్లోనూ దోపిడీకి పాల్పడ్డారు. అర్థరాత్రి ఒంటి గంట తర్వాత దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డారని గుర్తించారు. దీనిపై ఆ ట్రెయిన్స్ లోని ప్యాసింజర్స్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ట్రెయిన్లు కావలి చేరుకున్నాక అక్కడి పోలీసులకు విషయం తెలియజేశారు.
మరోవైపు ఈ వరుస ఘటనలపై రైల్వే శాఖ సైతం దృష్టిసారించింది. ప్రయాణికులకు చెందిన ఏమేం ఐటెమ్స్ మాయమయ్యాయన్న కోణంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. రెండు ట్రెయిన్లలో దోపిడీకి పాల్పడింది ఒకటే ముఠానా లేక వేర్వేరుగా చోరీలు చేశారా అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నారు.