తెల్లవారుతుండగానే ప్రయాణాన్ని(Journey) ప్రారంభించారు. మరోవైపు డ్రైవర్ మద్యం తాగి వాహనాన్ని నడిపాడు. ఇలా రెండూ కలిసి పెను ప్రమాదాన్ని కలిగించాయి. పొద్దు పొద్దున్నే ఆటోలో బయల్దేరిన వారిలో కొందరిని మృత్యువు వెంటాడింది. ఆటోను లారీ వేగంగా ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వరంగల్ నుంచి తొర్రూర్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.వర్ధన్నపేట మండల ఇల్లందలో జరిగిన దుర్ఘటనలో మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆటోల్లో ప్రయాణించొద్దని తరచూ చెబుతున్నా పల్లెవాసులకు మరో మార్గం కనిపించడం లేదు. బస్సులు లేక, రవాణా సౌకర్యాలు కానరాక ఆటోలను ఆశ్రయించి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు గాల కారణాలపై దృష్టిపెట్టారు. మద్యం మత్తులోనే డ్రైవర్ లారీని నడపడంతో ప్రమాదం(Accident) జరిగినట్లు గుర్తించారు. ఆటోను ఢీకొట్టిన పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. ఆ స్పీడ్ కు మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడగా, ఆటో నుజ్జునుజ్జయింది. చనిపోయిన వారంతా తేనె సేకరించి విక్రయించే వారుగా గుర్తించారు. తేనె కోసం ఆటోలో వెళ్తుండగా విషాదం చోటుచేసుకుంది. మృతదేహాలను MGM హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. గాయపడ్డవారు చేసిన రోదనతో అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించాయి.