
గంజాయి మత్తులో ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో మరోసారి బయటపడింది. విచ్చలవిడిగా దొరుకుతున్న ఈ మత్తు పదార్థం.. దారుణాలకు ఉసిగొల్పుతోంది. తాజాగా హైదరాబాద్ మీర్ పేటలో బాలిక అత్యాచార ఘటనపై పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. గంజాయి బ్యాచే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నామని LBనగర్ DCP సాయిశ్రీ ప్రకటించారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నదని తెలిపిన DCP.. బాధిత అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్(Statement) ఆధారంగా ముగ్గురు నిందితులున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఏడు టీమ్స్ ను రంగంలోకి దించిన పోలీసులు.. మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.
కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, అత్యాచారానికి పాల్పడ్డవాళ్లంతా లోకల్ వాళ్లని తెలిపారు. ఈ కేసులో ఓ రౌడీ షీటర్ పై అనుమానం ఉందని, ముగ్గురు వ్యక్తులే అత్యాచారం చేసినట్లు బాలిక చెప్పిందని DCP వివరించారు.