
బాలికపై అత్యాచారానికి గంజాయి మత్తే రీజన్ అని తేలిన 24 గంటల్లోనే అక్రమ దందా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నలుగురిని అరెస్టు చేసి భారీయెత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిన్న పిల్లల్ని దుకాణాల్లో ఉంచి ఈ మత్తు పదార్థాన్ని అమ్ముతున్నారని నార్కోటిక్ డిపార్ట్ మెంట్ పోలీసులు గుర్తించారు. ఇల్లీగల్(Illegal) దందాపై నిఘా పెట్టిన అధికారులు… 22 కిలోలకు పైగా గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడ్డ ఐటెమ్ విలువ రూ.4 కోట్లకు పైగా ఉంటుందని దీనిపై పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామన్నారు. 5 గ్రాముల వెయిట్ తో కూడిన 281 ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్ కు తరలించారు. అరెస్టయిన వారి నుంచి UPI స్కానర్లు, సెల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్లు స్వాధీనం చేసుకోగా.. అక్రమ రవాణాకు అడ్డాగా మారిన ఇళ్లను సీజ్ చేశారు. ధూల్ పేట్ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా అవుతున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ మీర్ పేట్ లో 16 ఏళ్ల బాలికపై ఎనిమిది మంది దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆమె ఇంట్లోకి చొరబడి ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత ఫ్యామిలీ మెంబర్ ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా దర్యాప్తు(Investigation) చేపట్టిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. గంజాయి మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గుర్తించడంతో పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు నిఘా పెట్టి ఈరోజు గంజాయిని పట్టుకున్నారు.