చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇద్దరు MLAల మధ్య గొడవ చోటుచేసుకుంది. భద్రాచలం ఎమ్మెల్యే, BRSకు చెందిన రేగా కాంతారావు, కాంగ్రెస్ MLA పొదెం వీరయ్య మధ్య వివాదం జరిగింది. భద్రాచలంలో చెక్కులు పంపిణీ చేస్తుండగా ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంతో రేగా కాంతారావుకు ఏం సంబంధమని, ఆయన ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ వీరయ్య విమర్శించారు. కాంతారావు చేతి నుంచి మైకును లాక్కున్నారు వీరయ్య. బీసీల రూ.లక్ష స్కీమ్ కు సంబంధించిన చెక్కులు అందిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ పరిస్థితుల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరుపార్టీల కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే అయిన పొదెం వీరయ్యకు తెలియకుండా లబ్ధిదారుల(Benificiaries)ను సెలెక్ట్ చేశారంటూ ఆయన అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. ఇరువర్గాల అరుపులతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది.