పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన నిందితులపై CID గట్టి నిఘా పెట్టింది. క్రమంగా నిందితులందర్నీ జైలుకు పంపిస్తోంది. సింగరేణి ఎగ్జామ్ లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన మరో వ్యక్తిని CID అధికారులు అరెస్టు చేశారు. 2020లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించిన E&M గ్రేడ్ E2 పరీక్షలో శైలేష్ కుమార్ యాదవ్ మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డట్లు CID నిర్ధరించింది. ఈయనతోపాటు మరికొందరు సైతం ఇదే రీతిన పరీక్షలు రాసినట్లు గుర్తించింది. బ్లూటూత్, రిసీవర్ వంటి ఎక్విప్ మెంట్ ను ఉపయోగించి అసలు క్యాండిడేట్ల స్థానంలో నిందితులు పరీక్ష రాసినట్లు అధికారులు గుర్తించి కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కాగా ఇన్వెస్టిగేషన్ ను CIDకి అప్పగించారు.
పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్న CID.. అక్రమాల్లో ప్రమేయమున్న అందర్నీ రిమాండ్ కు తరలిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు శైలేష్ కుమార్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మాల్ ప్రాక్టీస్ కేసులో ఇప్పటివరకు 20 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులందరిపైనా 120(B), 417, 420, 419 IPC సెక్షన్లు పెట్టారు.