రోడ్లు శుభ్రం చేసేందుకు తెల్లవారకముందే బయటకు వచ్చే కార్మికుల పరిస్థితి దయనీయం. అందరూ నిద్ర లేచేసరికి పరిసరాలు నీట్ గా ఉంచేందుకు కార్మికులు చిమ్మచీకట్లోనే ఇళ్ల నుంచి బయల్దేరతారు. అలా రోడ్డుపై పనిచేస్తున్న సమయంలో బస్సు ఢీకొట్టడంతో కార్మికురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన GHMC పరిధిలో జరిగింది. సునీత(35) రామ్ కోఠిలో రోడ్లు ఊడుస్తుండగా.. అయాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీకి చెందిన బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలవగా.. అక్కడున్న వారందరూ ఆందోళనకు దిగారు.
తొలుత తీవ్రంగా గాయపడ్డ సునీతను ఉస్మానియా హాస్పిటల్ కు తరలిస్తుండగానే ప్రాణాలు విడిచారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేయడమే కాకుండా డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.