వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) ఫైనల్లో ఫెయిలయిన ఇద్దరు స్టార్ ప్లేయర్లపై బీసీసీఐ వేటు వేసింది. విండీస్ పర్యటనకు టెస్ట్ స్పెషలిస్ట్ చెతేశ్వర్ పుజారా, ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ను తప్పించింది. గత ఐపీఎల్ లో సత్తా చాటిన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లను జట్టులోకి తీసుకుంది. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చి, నవదీప్ సైనీకి ఓకే చెప్పింది. ఇద్దరు వికెట్ కీపర్లు కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ జట్టులో ఉంటారు. జులై 12 నుంచి వెస్టిండీస్ పర్యటన స్టార్ట్ కానుండగా.. రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు జరుగుతాయి.
వన్డేలకు ఇద్దరు కీపర్లు
రోహిత్ శర్మ నాయకత్వంలో టెస్టులు, వన్డేలు జరగనుండగా.. వన్డేలకు వైస్ కెప్టెన్ గా హార్డిక్ పాండ్య ఎంపికయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ తోపాటు యువ బౌలర్ ముకేశ్ కుమార్ జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతం టెస్టు, వన్డే సిరీస్ లకు మాత్రమే జట్లను సెలెక్ట్ చేశారు.