అప్పటికే ఆ విమానం ల్యాండ్ అయి రన్ వే పై పరుగులు పెడుతున్నది. ఫాస్ట్ గా వెళ్తున్న టైమ్ లోనే దాని డోర్ తీయాలని ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఎంతకీ అతడు వినకపోవడంతో అందులో ఉన్న ఎయిర్ హోస్టెస్ ఏకంగా ఆ వ్యక్తిపైకి దూకి గట్టిగా వెనక్కు లాగింది. అయినా ఆమెపై దాడి చేస్తూనే ఫ్లైట్ డోర్ తీసేందుకు ముందుకు ఉరికాడు. కానీ ఆ ఎయిర్ హోస్టెస్ గట్టిగా అరవడంతో మిగతా ప్యాసింజర్స్ వచ్చి అతణ్ని కొట్టారు. ఈ ఘటన అసోం రాజధాని గువాహటిలో జరిగింది. హైదరాబాద్ నుంచి వయా గువాహటి మీదుగా త్రిపుర రాజధాని(Capital) అగర్తలకు వెళ్తున్న ఇండిగో 6E457 నంబరు గల ఫ్లైట్ లో పెద్ద దుమారమే చెలరేగింది. తూర్పు అగర్తలలోని జిరానియా ప్రాంతానికి చెందిన విశ్వనాథ్ దేవ్ నాథ్(41).. ఫ్లైట్ లో జర్నీ చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డాడు. విమానం రన్ వే పై ఉండగానే సీట్ నంబరు 1D నుంచి లేచి వచ్చి ఫాస్ట్ గా ఫ్లైట్ లోని ముందు డోర్ వద్దకు చేరుకున్నాడు. డోర్ తెరవబోతున్న సమయంలో అందులోని ఒక ఎయిర్ హోస్టెస్… అతణ్ని వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో ఆ వ్యక్తి సదరు ఎయిర్ హోస్టెస్ ను దారుణంగా కొట్టాడు.
డ్రగ్స్ కు బానిస
ఒకవైపు విశ్వనాథ్ ను వెనక్కు లాగుతూనే ఆమె గట్టిగా అరిచింది. దీంతో మిగతా ప్యాసింజర్ అక్కడకు చేరుకుని విశ్వనాథ్ ను అడ్డుకోబోయారు. అయినా వినకుండా అడ్డుకోబోయిన ప్యాసింజర్స్ పైనా దాడికి యత్నించాడా దుండగుడు. పరిస్థితి అదుపు దాటడంతో అక్కడున్నవారంతా పిడిగుద్దులతో విశ్వనాథ్ పని పట్టారు. చివరకు అగర్తలకు చేరుకున్న తర్వాత అతణ్ని CISF జవాన్లకు అప్పగించారు. హాస్పిటల్ లో టెస్టులు చేస్తే అతను డ్రగ్స్ కు బానిస అని తేలింది. వెంటనే దుండగుడిని అరెస్టు చేశారు. విశ్వనాథ్ దాడిలో చంద్రిమా చక్రవర్తి, మనీశ్ జిందాల్ అనే ఫ్లైట్ సిబ్బంది గాయాలపాలయ్యారు.
Very good language, nice composition, latest news international to local
News covarge excellent ,keep it up All the best
Thank you
Interesting news