మత్తు పదార్థాల కేసులో అరెస్టయిన వ్యక్తులు తనకు తెలుసని కానీ డ్రగ్స్ తో తనకెలాంటి సంబంధం లేదని సినీ నటుడు నవదీప్ అన్నారు. పోలీసులు అనుమానిస్తున్న రాంచందర్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం నుంచే తెలుసని, అవసరమైతే మళ్లీ విచారణకు రావాలని పోలీసులు చెప్పారన్నారు. నవదీప్ పై నార్కోటిక్ పోలీసులు చేపట్టిన విచారణ ముగిసింది. వివిధ కోణాల్లో ఆయన నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్… హైదరాబాద్ పోలీసుల తీరును మెచ్చుకున్నారు. తొలుత మీరు నోటీసు చూశారా అని మీడియాను ప్రశ్నించారు.
‘హైదరాబాద్ లో 10 వేల మంది నాకు తెలుసు.. చాలా సక్సెస్ ఫుల్ టీమ్ ను క్రియేట్ చేశారు.. ఎంత బ్యూటిఫుల్ గా ఇన్వెస్ట్ గేట్ చేస్తున్నారంటే.. ఆల్ మోస్ట్ ఏడెనిమిదేళ్ల ఫోన్ కాల్స్ ని కూడా.. రిమోటెస్ట్ ఆఫ్ ది రిమోట్ కనెక్షన్ ను కూడా దాని రూట్ లో కెళ్లి ఇది ఏంటి.. కనెక్షన్ ఏంటి.. అన్న కోణంలో విచారణ చేస్తున్నారు’ అని అన్నారు.