వివిధ దేశాలకు చెందిన స్మగ్లర్ల(Smugglers) నుంచి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల(Drugs)ను కస్టమ్స్ అధికారులు ధ్వంసం చేశారు. వీటి విలువ రూ.468 కోట్లు ఉంటుందని తెలిపారు. 216.28 కేజీలను ధ్వంసం చేయగా.. ఇందులో రూ.195.37 కోట్ల విలువ గల 27.9 కిలోల హెరాయిన్ ఉంది. రూ.272.5 కోట్ల విలువైన 136.28 కేజీల మెఫోడ్రిన్ ను పూర్తిగా నాశనం చేశారు. నైజీరియా, టాంజానియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి హైదరాబాద్ కు తరలించిన మాదక ద్రవ్యాలను డీఆర్ఐ(Department Of Revenue Intelligence) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ వద్ద మత్తు పదార్థాలను పనికిరాకుండా చేశారు. ఇక రూ.40 విలువైన విదేశీ సిగరేట్స్ ను కూడా ధ్వంసం చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలియజేశారు.