రైలు పట్టాలు తప్పడంతో(Derailed) ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 70 మంది గాయపడ్డారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బిహార్ బక్సర్ జిల్లాలోని రఘునాథ్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో 12506 నంబరు గల నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ పట్టాలు తప్పింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి అసోంలోని కామాఖ్యకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రాత్రి పూట జరిగిన ఈ దుర్ఘటనలో 21 బోగీలు పట్టాలు తప్పగా, రెండు AC 3 టైర్ కోచ్ లు పక్కకు పడిపోయాయి. ఘటన జరిగిన వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఆ శాఖ అధికారులు సమాచారం అందించడంతో వెంటనే రెస్క్యూ టీమ్స్ ను పంపించి పలువురిని కాపాడగలిగారు. NDRF, SDRF, జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొని, గాయపడ్డవారిని హాస్పిటల్స్ కు షిఫ్ట్ చేసింది.
33 గంటల జర్నీ
నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల(Passengers)ను వేరే రైలులో గమ్యస్థానాలకు పంపించారు. బుధవారం పొద్దున 7:40 గంటలకు ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి బయల్దేరిన ఈ రైలు 33 గంటల జర్నీ తర్వాత కామాఖ్యకు చేరుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసోం రాజధాని గువాహటి 6 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది.