రివర్స్ గేర్ వేయాల్సిన డ్రైవరు ఫస్ట్ గేర్ వేయడంతో వేగంగా బస్సు ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చింది. అక్కడే మరో వెయిట్ చేస్తున్న ముగ్గురు బస్సు చక్రాల కింద పడి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ప్రగతి రథాలు అని చెప్పుకునే APSRTC బస్సు.. పలువురి జీవితాల్ని నలిపేసింది. విజయవాడ బస్టాండ్ లో బీభత్సం సృష్టించిన ఘటన సంచలనానికి కారణమైంది. 11, 12వ నంబరు ప్లాట్ ఫాంల పైకి బస్సు దూసుకువచ్చిన దుర్ఘటనలో ఆర్టీసీ కండక్టర్ తోపాటు ఇద్దరు ప్యాసింజర్స్ ప్రాణాలు కోల్పోయారు. బస్సు స్పీడ్ కు ప్లాట్ ఫామ్ లపై ఫెన్సింగ్ తోపాటు ఇనుప ఛైర్ లు నుజ్జునుజ్జయ్యాయి. మృత్యువాతపడ్డ వారిలో ఓ బాలుడు ఉన్నారు.
బ్రేక్ ఫెయిలయి…
విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన మెట్రో లగ్జరీ సిటీ బస్సు రెండు నగరాల మధ్య తిరుగుతుంటుంది. రివర్స్ గేర్ కు బదులు ఫస్ట్ గేర్ వేయడం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు.