PHOTO: THE TIMES OF INDIA
విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న మహిళా అధికారి.. మాఫియా కిరాతకానికి బలయింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిమ కె.ఎస్. అనే 45 ఏళ్ల జియాలజిస్ట్ సౌత్ బెంగళూరులో హత్యకు గురయ్యారు. విధానసౌధ సమీపంలో దొడ్డకల్లసాండ్ర గోకుల్ నగర్ వీవీ టవర్స్ 13వ ఫ్లోర్ లో ఆమె ఉంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆమె డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిమ భర్త స్కూల్ టీచర్ కాగా వీరికి 10 సంవత్సరాల బాబు ఉన్నాడు. ప్రతిమ బెంగళూరులో ఉంటే 300 కిలోమీటర్ల దూరంలోని శివమొగ్గ పట్టణంలో ఆమె భర్త పనిచేస్తున్నారు.
PHOTO: THE TIMES OF INDIA
మాఫియా ఘాతుకమే’నా’..!
జియాలజిస్ట్ ప్రతిమ ఈ మధ్యనే అక్రమ మైనింగ్ తోపాటు ఇసుక మాఫియాపై దృష్టి సారించారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేలా చర్యలకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. అయితే ఇది మాఫియా పనా లేక కుటుంబ గొడవలా అన్న కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. 16 ఏళ్ల వైవాహిక జీవితంలో ఏనాడూ భార్యభర్త గొడవలు పడలేదని మృతురాలి బామ్మ అంటున్నారు.