విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఫైర్ యాక్సిడెంట్ కేసులో ప్రధాన నిందితుడు వాసుపల్లి నాని అని పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. నిందితుడి మామ సత్యం ఉప్పు చేప వేపుతున్నప్పుడు చెలరేగిన నిప్పు రవ్వల కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం 30 బోట్లు పూర్తి కాలిపోయాయన్నారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను గుర్తించామని త్వరలో వారిని అరెస్టు చేస్తామని సీపీ రవిశంకర్ తెలిపారు.
ఈ నెల 19న వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని రూ.కోట్ల విలువ చేసే బోట్లు, చేపలు అగ్నికి ఆహూతయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం యూట్యూబర్ నాని ప్రధాన కారణమని మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. విచారణ తర్వాత అతనికి ఫైర్ యాక్సిడెంట్‌కు సంబంధం లేదని తెలిసి పోలీసులు వదిలిపెట్టారు. ఈ కేసులో తాజా మత్స్యకారుడు వాసుపల్లి నానిని ప్రధాన నిందితుడిగా గుర్తించడం గమనార్హం.