జమ్మూకశ్మీర్ లోని సాయుధ గ్రూపులు, పిల్లలను రిక్రూట్ చేసుకోవడం, వారిని ఘర్షణలకు రెచ్చగొట్టడం వంటి కారణాలతో ఇన్నాళ్లూ భారత్ పేరును ఐరాస వార్షిక నివేదికలో ఉంచేవారు. కానీ ప్రస్తుతం భారత్ లో పూర్తి సానుకూల వాతావరణం ఉన్నట్లు గుర్తించిన (UN)… ఆ రిపోర్ట్ నుంచి ఇండియా పేరు తొలగించింది. ‘చిల్డ్రన్-ఆర్మ్ డ్ కన్ ఫ్లిక్ట్’పై ఐరాస సెక్రటరీ జనరల్ యాన్యువల్ రిపోర్ట్-2023 నుంచి భారత్ పేరు తొలగించారు. జమ్మూకశ్మీర్ ఘర్షణల్లో భాగమయ్యే పిల్లలను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకునేవి. ఆ కారణంగా ఈ రిపోర్ట్ లో భారత్ పేరు ఎప్పుడూ ప్రస్తావిస్తూ వచ్చారు. పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, కామెరూన్ వంటి దేశాలతో పాటు ఇండియాను 2010 నుంచి ఆ లిస్టులో ఉంచేవారు.
చిన్నారుల రక్షణ కోసం మెరుగైన చర్యలు తీసుకున్నందువల్లే (UN) లిస్టు నుంచి భారత్ బయటపడింది. ఈ రిపోర్టు నుంచి బయటపడేలా మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టి సారించి అందుకు గల చర్యలు చేపట్టి ఫలితం రాబట్టింది. చిన్నారుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను (UN) చీఫ్ ఆంటోనియో గుటెరస్ తన రిపోర్ట్ లో ప్రస్తావించారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ‘జమ్మూకశ్మీర్ కమిషన్ ఏర్పాటు’లో డెవలప్మెంట్ ఉన్నట్లు గుర్తించామన్నారు.
Every news is reliable and real.
Every news is reliable and real for better society.