టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు దేశవ్యాప్తంగా అన్ని ఫిలిం ఇండస్ట్రీల ప్రముఖులతో మంచి సంబంధాలున్నాయి. ఇటీవలే తమిళ్లో ‘వారిసు’ చిత్రాన్ని నిర్మించిన ఆయన.. ప్రస్తుతం హిందీలోనూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, గురువారం ఆయన తనయుడు అన్వీ రెడ్డి మొదటి పుట్టినరోజు. దీంతో గ్రాండ్‌గా వేడుకలు ప్లాన్ చేసిన దిల్ రాజు.. వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన 650 మందికి పైగా ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఈ పార్టీకి హాజరు కావచ్చు.
ఇదిలా ఉంటే.. మొదటి భార్య మరణించిన తర్వాత దిల్ రాజు వైఘారెడ్డిని 2020లో వివాహం చేసుకున్నారు. వీరికి 2022లో కొడుకు అన్వీ రెడ్డి పుట్టాడు. నేడు (గురువారం) అతని ఫస్ట్ బర్త్‌డే కావడంతో ఈ వేడుకలకు రాజకీయ, వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులను ఆహ్వానించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్, ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు తదితరులు ఈ గ్రాండ్బాష్కు హాజరుకానున్నారు.
ఇక దిల్ రాజు సినిమాల విషయానికొస్తే.. తన బ్యానర్లో 50వ చిత్రంగా శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో ‘గేమ్ ఛేంజర్’ చిత్రం తెరకెక్కుతోంది. మరోవైపు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్లో ఇటీవలే సినిమా ప్రకటించాడు. ఇవేకాక మరికొన్ని ప్రాజెక్ట్‌లు సెట్స్‌పై ఉన్నాయి.