సుందర్ పిచాయ్.. సత్య నాదెళ్ల.. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు వీరిద్దరూ CEOలుగా ఉన్నారు. సెర్చ్ ఇంజిన్ లో ఇన్నోవేషన్ తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో సుందర్ పిచాయ్ కు తిరుగులేదు. ఒక సామాన్య ఎంప్లాయ్ గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన గూగుల్ లో CEO లెవెల్ కు చేరుకున్నారు. మరోవైపు క్లౌడ్ కంప్యూటింగ్ లో ఎక్స్ పర్ట్ గా పేరు సంపాదించిన సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ CEOగా కంపెనీని అగ్రపథాన తీసుకెళ్తున్నారు. ఈ కోవలో మరికొంతమంది చేరుతున్నారు. వరల్డ్ టాప్ కంపెనీల్లో వీరిద్దరితో కలిసి మొత్తం 16 సంస్థలకు భారత సంతతి వ్యక్తులే సీఈవోలు ఉన్నారు.
స్టీవ్ సంఘ్వి.. ‘మైక్రో చిప్’
US బేస్డ్ చిప్ కంపెనీ అయిన ‘మైక్రో చిప్’ నకు 2021 మార్చి నుంచి స్వీవ్ సంఘ్వి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన 1991లో’మైక్రో చిప్’ CEOగా పనిచేయగా, 1993 అక్టోబరులో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1990 ఆగస్టు నుంచి 2016 ఫిబ్రవరి వరకు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ‘మైక్రో చిప్’లోకి రాకముందు సంఘ్వి.. 1988 నుంచి 90 వరకు సెమీకండక్టర్ కంపెనీ అయిన ‘వేఫర్ స్కేల్ ఇంట్రిగ్రిషన్’కు వైస్ ఛైర్మన్ గా పనిచేశారు. అంతకుముందు 1978-88 మధ్యకాలంలో ‘ఇంటెల్’లో ఉద్యోగం చేశారు. మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజినీరింగ్ లో స్టీవ్ సంఘ్వి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.
నికేశ్ అరోరా.. ‘పాలో ఆల్టో నెట్ వర్క్స్’
గూగుల్, సాఫ్ట్ బ్యాంక్ కంపెనీల్లో కీలక స్థానాల్లో పనిచేసిన నికేశ్ అరోరా.. ‘పాలో ఆల్టో నెట్ వర్క్స్’కు 2018 నుంచి CEOగా ఉన్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో IT బ్యాచిలర్ డిగ్రీ పొందారు. మరో రెండు ఫారిన్ యూనివర్సిటీల్లో MBA, మాస్టర్ సైన్స్ చేశారు.
శంతను నారాయణ్.. ‘అడోబ్(Adobe)’
‘అడోబ్(Adobe)’ CEO శంతను నారాయణ్ 1998లో వైస్ ప్రెసిడెంట్ చేరి వరల్డ్ వైడ్ ప్రొడక్ట్ రీసెర్చ్ లో సంచలనం సృష్టించారు. 2005లో చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ COOగా ఉన్న ఆయన 2007లో సీఈవోగా నియమితులయ్యారు. ‘అడోబ్’ కన్నా ముందు ‘ఆపిల్’, ‘సిలికాన్ గ్రాఫిక్స్’ సంస్థల్లో పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ సైన్స్, కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి MBA, బెర్కిలీలోని గ్రీన్ స్టేట్ వర్సిటీ నుంచి MS పట్టాలు అందుకున్నారు.
అరవింద్ కృష్ణ.. ‘ఐబీఎం’
కాన్పూర్ IIT నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, ఇల్లినాయిస్ వర్సిటీ నుంచి PhD పొందిన అరవింద్ కృష్ణ.. 2020 ఏప్రిల్ లో IBM సీఈవో నియామకమయ్యారు. 30 ఏళ్ల పాటు ఆయన IBMలో వివిధ స్థాయిల్లో పనిచేశారు.
అంజలి సుద్… ‘విమియో’
ఓపెన్ వీడియో ప్లాట్ ఫామ్ కు చెందిన ‘విమియో’ సంస్థకు 2017 నుంచి అంజలి సుద్ CEOగా ఉన్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి MBA డిగ్రీ పొందిన అంజలి అంతకుముందు ‘అమెజాన్’, ‘టైమ్ వార్నర్’ కంపెనీల్లో పనిచేశారు.
సంజయ్ మెహరోత్రా… ‘మైక్రాన్ టెక్నాలజీ’
ఈ మధ్యే గుజరాత్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన ‘మైక్రాన్ టెక్నాలజీ’కి భారత సంతతి వ్యక్తి సంజయ్ మెహరోత్రా ప్రెసిడెంట్, సీవోగా ఉన్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందిన సంజయ్.. 70 పేటెంట్లను సొంతం చేసుకున్న ఘనతను సాధించారు.
రేవతి అద్వైతి… ‘ఫ్లెక్స్’
అమెరికా-సింగపూర్ కు చెందిన మల్టీనేషనల్ కంపెనీ అయిన ‘ఫ్లెక్స్’ కి 2019 నుంచి రేవతి అద్వైతి CEO పనిచేస్తున్నారు. బిట్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ తీసుకున్న రేవతి.. థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్ మెంట్ నుంచి MBA పట్టా పొందారు. అంతకుముందు ఎలక్ట్రికల్ సెక్టార్ లోని ‘ఈటన్స్’ కంపెనీకి సీవోవోగా పనిచేశారు.
జయశ్రీ ఉల్లాల్… ‘అరిస్టా నెట్వర్క్’
క్లౌడ్ నెట్ వర్కింగ్ కంపెనీ అయిన ‘అరిస్టా నెట్వర్క్’ కు 2008 నుంచి జయశ్రీ ఉల్లాల్ CEOగా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలోనే ‘అరిస్టా నెట్వర్క్’ 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీలో IPOకు వెళ్లిన ఘనతను అందుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ నుంచి BS, శాంటాక్లారా వర్సిటీ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆమె.. ‘అరిస్టా నెట్వర్క్’కు ముందు ‘సిస్కో’, ‘AMD’ల్లో ఉద్యోగం చేశారు.
అనిరుధ్ దేవ్ గన్… ‘క్యాడెన్స్ డిజైన్’
దిల్లీ IIT నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ, కార్నెగి మిలన్ వర్సిటీ నుంచి MS, PhD సాధించిన అనిరుధ్ దేవగన్.. ‘క్యాడెన్స్ డిజైన్’కు 2021 నుంచి CEOగా ఉన్నారు. 2017 నుంచి ఆ కంపెనీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంతకుముందు ఆయన ‘డిజిటల్’ ‘సిగ్నాఫ్ సిస్టమ్స్ వెరిఫికేషన్ గ్రూప్’నకు జనరల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు.
శివ శివరామ్… ‘వెస్ట్రన్ డిజిటల్’
సెమీ కండక్టర్స్, 3D మెమొరీ ఆర్కిటెక్చర్స్, ప్రాసెస్ టెక్నాలజీ, ఎక్విప్ మెంట్, మెటీరియల్స్ లో నిష్ణాతుడైన శివ శివరామ్.. 2016లో ‘వెస్ట్రన్ డిజిటల్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. 3 దశాబ్దాల పాటు ఆయన ‘శాన్ డిస్క్’లో పనిచేయగా, ఆ కంపెనీని ‘వెస్ట్రన్ డిజిటల్’ టేకోవర్ చేసింది. ‘ఇంటెల్’, ‘మాట్రిక్స్’ వంటి సెమీకండక్టర్ తయారీ కంపెనీల్లో కీలకంగా వ్యవహరించారు. మెకానికల్ ఇంజినీరింగ్ లో తిరుచ్చి IIT నుంచి పట్టా పొందారు శివ శివరామ్.
రఘు రఘురామ్… ‘VMవేర్’
వేర్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి MBA డిగ్రీ పొందిన రఘు రఘురామ్.. 2021లో ‘VMవేర్’ CEOగా నియమితులయ్యారు. 2003 నుంచి ఆయన ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ‘AOL’లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ విభాగాల్లో కీలకంగా వ్యవహరించి సదరు సంస్థను ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు.
జార్జ్ కురియన్… ‘నెట్APP’
స్టోరేజ్, డేటా మేనేజ్మెంట్ కంపెనీ అయిన ‘నెట్APP’కు జార్జ్ కురియన్ CEO, ప్రెసిడెంట్ గా బాధ్యతలు చూస్తున్నారు. అంతకుముందు ఆయన అదే సంస్థకు 2015 నుంచి CEOగా ఉన్నారు. కేరళలో జన్మించిన ఆయన మద్రాస్ IIT నుంచి బీటెక్ పూర్తి చేశారు. ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన కురియన్.. ‘సిస్కో సిస్టమ్స్’, ‘అకామాయ్ టెక్నాలజీస్’, ‘మెకిన్సే అండ్ కంపెనీ’ల్లోనూ పనిచేశారు.
అనిల్ భస్రీ… ‘వర్క్ డే’
‘పీపుల్ సాఫ్ట్’ ఫౌండర్ డేవ్ డఫిల్డ్ తో కలిసి 2005లో అనిల్ భస్రీ.. ‘వర్క్ డే’ కంపెనీని స్థాపించారు. బ్రౌన్ వర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి MBA పట్టా పొందిన అనిల్… ఉన్నత కంపెనీల్లో పనిచేశారు.
అమన్ భుటానీ… ‘గోడాడీ’
‘ఎక్స్పీడియా’, ‘జేపీ మోర్గాన్’లో పనిచేసిన అమన్ భుటానీ 2019 నుంచి ‘గోడాడీ’ CEOగా ఉన్నారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, లాంకషైర్ వర్సిటీ నుంచి MBA పొందిన అమన్ భుటానీ.. కీలక స్థానాల్లో విధులు నిర్వర్తించారు.