
టీవీ కొనాలంటే ఇప్పుడే తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. ఎల్ఈడీ టీవీల ధరలు కొత్త ఏడాది మొదట్నుంచే పెరిగే అవకాశాలున్నాయి. ప్రపంచ మార్కెట్లో మెమొరీ చిప్ ల తీవ్ర కొరత వల్ల రేట్లు పెరగనున్నాయి. TVల విడిభాగాల్లో 30 శాతం దేశీయంగా తయారైతే, మిగతా 70% విదేశాలవే. డాలర్ తో రూపాయి విలువ 90 దాటడంతో దిగుమతి ఖర్చులు పెరిగాయి. AI సర్వర్లు, డేటా సెంటర్ల హై బ్యాండ్ విడ్త్ చిప్ లపైనే దృష్టిపెట్టడంతో టీవీ చిప్ లు తగ్గిపోయాయి. దీంతో 3-4% దాకా, ఒకానొక దశలో ఇది 7% వరకు ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటికే కొన్ని బ్రాండ్ల డీలర్లకు సంకేతాలు వచ్చాయట. చిప్ ల ధరలు గత మూడు నెలల్లోనే 500% పెరిగాయి. 32 అంగుళాలకు పైన ఉన్న టీవీలకు GSTని కేంద్రం 28% నుంచి 18 శాతానికి తగ్గించడంతో ఇప్పటిదాకా నాలుగైదు వేల మేర తక్కువకు వస్తున్నాయి. ఈ లెక్కన జీఎస్టీ వల్ల తగ్గిన రేట్లు ఈ రూపంలో పెరుగుతాయన్నమాట.