సీనియర్ సినీ నటి జయసుధ.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో కండువా కప్పి బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్… ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసే కమలం పార్టీలో చేరుతున్నట్లు జయసుధ ప్రకటించారు. ఇందుకోసం రెగ్యులర్ గా పార్టీ లీడర్లతో మాట్లాడుతున్నానని తెలిపారు. ఇక నుంచి క్రైస్తవుల ప్రతినిధిగా స్వరం వినిపిస్తానని ఆమె తెలియజేశారు.
‘గత ఏడాది కాలంగా బీజేపీలో చేరాలని చూస్తున్నాను.. ఇందుకోసం ఆ పార్టీ లీడర్లతో సంప్రదింపులు జరిపాను.. ప్రధాని చేస్తున్న అభివృద్ధి, కమలం పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితురాలినయ్యాను.. అందుకే ఆ పార్టీలో చేరుతున్నాను’ అని జయసుధ ప్రకటించారు.