
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్.. మూవీపై అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే.. గుంటూరు కారం గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో మహేష్ నటించిన ‘ఒక్కడు’ మూవీలో కబడ్డీ గేమ్ బ్యాక్ డ్రాప్లో ఉండే యాక్షన్ బ్లాక్‌ను ఈ సినిమాలో రిపీట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఒక్కడు మూవీలో కబడ్డీ యాక్షన్ బ్లాక్‌కు బాగా పేరొచ్చింది. కాగా.. ఈ ఏడాది జనవరిలో జరిగిన ‘గుంటూరు కారం’ ఫస్ట్ షెడ్యూల్లో దర్శకుడు త్రివిక్రమ్ క్రేజీ కబడ్డీ ఫైట్ సీక్వెన్స్‌ని రూపొందించగా.. కొన్ని కారణాల వల్ల ఆ సీక్వెన్స్‌ను పక్కనపెట్టేశారు. అయితే ఇప్పుడు అదే సీక్వెన్స్‌ను కొన్ని మార్పులతో తాజాగా మళ్లీ చిత్రీకరించినట్లు వినిపిస్తోంది. ఈ యాక్షన్ బ్లాక్ అభిమానులకు, యాక్షన్-ఫిల్మ్ ప్రేమికులకు విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందని తెలుస్తంది. మొత్తానికి గుంటూరు కారం మూవీ త్రివిక్రమ్ స్టైల్లో కామిక్ టచ్, ఇంటెన్సిటీని కలిగి ఉంటుందని టాక్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో పలు ప్రదేశాల్లో జరుగుతోంది.
Super