నేషనల్ బెస్ట్ యాక్టర్ గా నిలిచిన అల్లు అర్జున్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డ్ ప్రకటించగానే ‘పుష్ప(ద రైజ్)’ మూవీ టీమ్ ఆయన ఇంటికి చేరుకుంది. బన్నీని చూసి డైరెక్టర్ సుకుమార్ ఎమోషనల్ గా ఫీలయ్యారు. గట్టిగా హగ్ చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు చిరంజీవి కుటుంబ సభ్యులతోపాటు జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి సహా పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు బన్నీకి విషెస్ చెప్పారు. అనంతరం ‘పుష్ప’ టీమ్ మెంబర్స్ తో కలిసి బన్నీ కేక్ కట్ చేశారు.
ఇక అల్లు అర్జున్ నివాసం వద్ద కోలాహలం నెలకొంది. ఆయనకు అవార్డు ప్రకటించారని తెలియగానే ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.