
ఉత్తరాఖండ్(uttarakhand) లో ఘోర ప్రమాదం జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. చమోలి జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ పేలి షాక్ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. అలకానంద నది ఒడ్డున పంపింగ్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నమామీ గంగా ప్రాజెక్టులో భాగంగా అలకానంద రివర్ బ్రిడ్జి వద్ద కొంతమంది పనిచేస్తున్నారు. ఆ బ్రిడ్జికి ఉన్నట్టుండి కరెంటు సప్లయ్ కావడంతో 15 మంది ప్రాణాలు విడిచారు. వారిలో కొంతమంది పోలీసులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
రెయిలింగ్ కు కరెంటు సప్లయ్ కావడం వల్లే ఇన్సిడెంట్ జరిగి ఉంటుందని ఉత్తరాఖండ్ ADGP మురుగేశన్ తెలిపారు. గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.