పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ దేశాలకు చెందిన కేటుగాళ్లతో వీరికి సంబంధాలున్నట్లు గుర్తించారు. నాలుగు రాష్ట్రాల్లో ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. వరుస మోసాలతో బెంబేలెత్తిస్తున్న 9 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, గుజరాత్, లఖ్ నవూ, ముంబయిలో వీరందరినీ అరెస్టు చేశారు. దుబాయ్, చైనాకు చెందిన నేరస్థులతో వీరికి ఉన్న సంబంధాలను గుర్తించారు.
ఈ ముఠా సభ్యులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం రూ.712 కోట్లు కొల్లగొట్టారు. నిందితుల నుంచి పెద్ద సంఖ్యలో సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, బ్యాంకు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్ కు తరలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.