మరో 25 రోజుల్లో అంటే ఈ నెలాఖరుకు పదవీ విరమణ(Retirement) చేయాల్సి ఉంది. అలాంటి అధికారి.. తన డ్రైవర్ ద్వారా రూ.22 వేలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు దొరికిపోయారు. జగిత్యాల జిల్లా రవాణాధికారి(DTO) భద్రునాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. JCBని వదిలిపెట్టేందుకు లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. కోరుట్లకు చెందిన శశిధర్ అనే వ్యక్తి నుంచి.. DTO డ్రైవర్ అరవింద్ నాయక్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. సదరు డ్రైవర్ ను ACB అదుపులోకి తీసుకుంది. కొంతకాలం క్రితమే ఆ అధికారి జగిత్యాల జిల్లాకు రాగా.. ఈ ఆగస్టు 31న రిటైర్ కావాల్సి ఉంది. గతంలో ఈయన హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో పనిచేయగా.. ఆయా ప్రాంతాల ట్రాక్ రికార్డుపైనా అధికారులు దృష్టిసారించారు.