బహుజన్ సమాజ్ పార్టీ(BSP) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ ను హత్య(Murder) చేసిన నిందితుడు పోలీస్ ఎన్కౌంటర్లో(Encounter) హతమయ్యాడు. ఈనెల 6న చెన్నై పెరంబూర్ సమీపంలోని సెంబియమ్ లో గల ఆయన ఇంట్లోనే ఆర్మ్ స్ట్రాంగ్ ను కత్తులతో నరికి చంపారు. దుండగులు పారిపోతుండగా అతడి స్నేహితులు వెంటపడ్డా దొరకలేదు.
కలకలం రేపి…
ఒక పార్టీ అధ్యక్షుణ్ని ఆరుగురు దుండగులు చంపడం కలకలానికి దారితీయగా.. CBI దర్యాప్తు జరిపించాలని మాయావతి డిమాండ్ చేశారు. తిరువేంగడమ్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా.. పోలీసులపైనే కాల్పులకు దిగి తప్పించుకునే ప్రయత్నంలో ఎన్ కౌంటర్ చేశారు. అతడి నుంచి కత్తులతోపాటు గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెన్నై పోలీసులు తెలిపారు. ఆర్మ్ స్ట్రాంగ్ చెన్నై కార్పొరేషన్ కౌన్సిలర్ గా 2006లో ఎన్నికయ్యారు.