బంగారం అక్రమ రవాణాలో కన్నడ నటి రన్యారావుకు రూ.102 కోట్ల జరిమానా పడింది. మరో ముగ్గురికి గాను ఒకరు రూ.63 కోట్లు, మరో ఇద్దరు రూ.56 కోట్లు చెల్లించాలని DRI అధికారులు నోటీసులు పంపారు. బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న ఈ నలుగురు ఫైన్ కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తారు. 2025 మార్చి 3న దుబాయి నుంచి వస్తూ 14.8 కిలోల బంగారంతో కెంపెగౌడ(Kempegowda) ఎయిర్ పోర్టులో పట్టుబడింది. సీనియర్ IPS కె.రామచంద్రారావు సవతి కూతురైన రన్య.. 2023 నుంచి 2025 మధ్య 52 సార్లు దుబాయి వెళ్లింది.