అధికారంలో ఉన్నన్నాళ్లూ అంతా బాగానే కనిపించినా, అది పోయాక మాత్రం అన్ని వైపులా ఆపద ముంచుకొస్తుంటుంది. అచ్చం ఇది KCR కుటుంబానికి వర్తిస్తున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ మాజీ ముఖ్యమంత్రి(Formar CM) కుమార్తె కల్వకుంట్ల కవిత మనీ లాండరింగ్ కు పాల్పడినందుకు అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆమె ED కస్టడీలో ఉన్నారు. ఇలా ఈ కేసు నడుస్తుండగానే ఆయన ఫ్యామిలీ మెంబర్, రాజ్యసభ సభ్యుడైన జోగినపల్లి సంతోష్ కుమార్ పైనా తాజాగా కేసు నమోదైంది(Case Filed). ఈయనతోపాటు లింగారెడ్డి శ్రీధర్ అనే వ్యక్తిపైనా కేసు ఫైల్ అయింది.
ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో…
నకిలీ పత్రాలు(Fake Papers) సృష్టించి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబరు 14లో భూమిని కబ్జా చేశారంటూ కంప్లయింట్ వచ్చింది. నవయుగ కంపెనీకి చెందిన చింతా మాధవ్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లయింట్ తో సంతోష్ కుమార్ పై పోలీసులు కేసు పెట్టారు. ఇవే కాకుండా కవిత ఆడపడచుకు గల మాదాపూర్ ఇంట్లోనూ నిన్న భారీగా సోదాలు జరిగాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆడబిడ్డపైనా అనుమానాలుండగా ED అధికారులు సోదాలు జరిపారు. అటు కవిత ఆడపడుచు కొడుకు పాత్ర కూడా ఉన్నట్లు అనుమానించి అతడి కోసం వేట కొనసాగిస్తున్నారు.
ఈ ఇద్దరే కాకుండా…
కవిత, సంతోష్ రావు, ఆమె ఆడపడచే కాకుండా.. వీరి పాలనా కాలంలో నిర్వహించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా తయారైంది. ఇప్పటికే ఈ కేసులో DSP ప్రణీత్ రావు కస్టడీ కొనసాగితే.. మరో ఇద్దరు ASPలు భుజంగరావు, తిరుపతన్నను ఈరోజు రిమాండ్ కు తరలించారు. ఇక SIB చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావుతోపాటు మొత్తం ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.