ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరో క్రిమినల్ హతమయ్యాడు. హత్యలు, దోపిడీలు సహా 13 కేసులున్న వాంటెడ్ క్రిమినల్ మహ్మద్ గుర్ఫాన్ ను కౌశాంబి జిల్లాలో మట్టుబెట్టారు. యూపీలో యోగి సర్కారు కొలువుదీరిన తర్వాత ఇప్పటివరకు 185 మంది గ్యాంగ్ స్టర్స్ హతమయ్యారు. రూ.1,25,000 రివార్డున్న ఇర్ఫాన్ మాంఝాన్ పూర్ సమీపంలో లక్నో ఏటీఎస్ చేతిలో హతమైనట్లు అక్కడి ఎస్పీ ప్రకటించారు. ప్రతాప్ గఢ్ కు చెందిన గుర్ఫాన్ పై హత్యలు, దోపిడీలు, హత్యాయత్నాల కేసులున్నాయి. గత ఏప్రిల్ లో ప్రతాప్ గఢ్ లోని జువెల్లరీ షాపులో గన్ తో బెదిరించి లూటీ చేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
యోగి హయాంలో…
2017లో యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 10 వేల ఎన్ కౌంటర్లు జరగ్గా… రౌడీషీటర్లు, గ్యాంగ్ స్టర్లు, దోపిడీదారులు 185 మంది దాకా హతమయ్యారు.