
కుటుంబంతో సరదాగా బీచ్ కు వెళ్లిన వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. సముద్రపు అలల తాకిడిలో తన పిల్లలు కొట్టుకుపోతుండగా వారిని కాపాడే ప్రయత్నంలో ఆ తండ్రే… గల్లంతయిన విషాద ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వాసి ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లాకు చెందిన పొట్టి రాజేశ్ కుమార్ అనే వ్యక్తి… విహారయాత్ర కోసం శనివారం తన భార్య, ఇద్దరు పిల్లలతో జాక్సన్ విల్ విట్లర్ బీచ్ కు వెళ్లారు. సముద్రం ఒడ్డున ఈత కొడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా వచ్చిన అలలకు పిల్లలు కొట్టుకుపోయారు. వారిని కాపాడిన రాజేశ్… ఆ అలల్లో కనిపించకుండా పోయాడు.
చివరకు మెరైన్ పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని నీటిలోంచి బయటకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని రాజేశ్ కుటుంబం… ప్రభుత్వాన్ని, అక్కడి తానా ప్రతినిధులను వేడుకుంటోంది.