సీఎం రిలీఫ్ ఫండ్(CMRF)లో జరిగిన అక్రమాలపై 6 కేసులు ఫైల్ చేసినట్లు CID ప్రకటించింది. 2024 ఆగస్టు 23న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించింది. ఆసుపత్రుల పేరిట నకిలీ రబ్బరు స్టాంపులు సృష్టించి ఒక్కో CMRF అప్లికేషన్ ను రూ.4,000కు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.
అలా నల్గొండ జిల్లా నుంచి 19 నకిలీ దరఖాస్తులు రాగా.. జిల్లా కేంద్రంలోని అమ్మ హాస్పిటల్, మిర్యాలగూడలోని నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరిట వాటిని సమర్పించారు. ఈ కేసులో A-1, A-2 నిందితుల్ని ఈనెల 30న అదుపులోకి తీసుకున్నారు. నకిలీ రబ్బరు స్టాంపులు, లెటర్ హెడ్స్, ఫేక్ మెడికల్ బిల్స్ కు సంబంధించిన సాఫ్ట్ కాపీలు స్వాధీనం చేసుకున్నారు.
A-1 అయిన మిర్యాలగూడకు చెందిన RMP గొట్టి గిరితోపాటు A-2 నిందితుడైన నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్ వైజర్ లేకిరెడ్డి సైదిరెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు CID DG ప్రకటనలో తెలిపారు.