
TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. వరుసగా అరెస్టులు కొనసాగుతుండగా ఇవాళ ఒక్కరోజే 19 మందిని రిమాండ్ కు పంపింది. అసిస్టెంట్ ఇంజినీర్ క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేసిన వారిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) అదుపులోకి తీసుకుంటోంది. AE రమేశ్ నుంచి పేపర్లు కొనుగోలు చేసిన వారు క్రమంగా అరెస్టవుతున్నారు. ఈ పేపర్ ను 30 మందికి రమేశ్ అమ్మినట్లు దర్యాప్తు ద్వారా SIT అధికారులు తేల్చారు.
రమేశ్ నుంచి పేపర్లు కొన్న మరికొంతమంది పేర్లు బయటకు వచ్చేలా SIT ఎంక్వయిరీ కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 74కు చేరుకుంది.