పదోతరగతి ప్రశ్నాపత్రం(Question Paper) లీక్ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఈనెల 21న క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చింది. పరీక్ష ప్రారంభమైన అరగంటకే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో స్థానిక MEOతో DEO విచారణ జరిపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈనెల 23న ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్(CS), డిపార్ట్మెంటల్ ఆఫీసర్(DO)ను విధుల నుంచి తప్పించగా, ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశారు. ఎగ్జామ్ సెంటర్లోకి ఓ యువకుడు దూకి సునాయాసంగా పై అంతస్తు కిటికీ వద్దకు చేరుకున్నాడు. అక్కడ విద్యార్థిని నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకుని ఫొటో తీయడం ప్లాన్ ప్రకారమే జరిగిందని అధికారులు గుర్తించారు.