
డబ్బులు డిమాండ్ చేస్తూ ఇద్దరు పోలీసు సిబ్బంది ఏసీబీ(Anti Corruption Bureau)కి పట్టుబడ్డారు. అందులో ఒకరు అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ కాగా మరొకరు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. ఏకంగా ఛార్జిషీట్ నుంచే నిందితుడి పేరు తొలగించేందుకు ప్లాన్ చేశారు. 498 A కేసులో ఇలా డబ్బులు డిమాండ్ చేసిన ఘటన హైదరాబాద్ లో బట్టబయలైంది. సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన ఛార్జిషీట్ నుంచి నిందితుడి పేరు తొలగించేందుకు రూ.5,000 డిమాండ్ చేసిన ASI సరళ, హెడ్ కానిస్టేబుల్ నరసింహ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
నిందితుడి నుంచి డబ్బు తీసుకుంటున్న సమయంలో అధికారులు వల పన్ని ఇద్దరు పోలీసుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుణ్ని ఛార్జిషీట్ నుంచి తొలగించాలని నిర్ణయించడమే పెద్ద తప్పు కాగా.. రూ.5,000కు కక్కుర్తి పడటం ఉద్యోగాల్ని, చివరకు జీవితాల్నే చిక్కుల్లో పడేసుకున్నారు ఇద్దరు పోలీసు అధికారులు.