
హోటల్ ముందు నిలబడి ఉన్న సమయంలో ఉన్నట్టుండి దుండగుడు దాడికి పాల్పడటంతో జగిత్యాల జిల్లా కోరుట్లలో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఓ కౌన్సిలర్ భర్త. పొద్దున్నే చాయ్ తాగేందుకు BRS నాయకుడు లక్ష్మీరాజం(45) హోటల్ కు వెళ్లారు. అక్కడ బయట మాట్లాడుతున్న సమయంలో దుండగుడు మెడపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో బాధితుణ్ని హుటాహుటిన కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ లక్ష్మీరాజం ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా రక్తస్రావం కావడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఈ దాడిలో ఇద్దరు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకరు బైక్ పైనే ఉండగా మరొకరు లక్ష్మీరాజం వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. కారణాలపై ఆరా తీస్తున్నారు.