హైదరాబాద్ లో యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. కత్తితో మెడపై దాడి చేయడంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తనను ప్రేమించడం లేదంటూ యువతిపై నాగరాజు అనే యువకుడు విజయనగర్ కాలనీలో దాడికి పాల్పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో మెడ, వీపుపై దాడికి దిగడంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావమైంది. ట్రీట్మెంట్ కోసం బాధితురాలిని హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. ఈ లోపు దాడికి పాల్పడ్డ యువకుడు సైతం సూసైడ్ కు యత్నించాడు.
కత్తితో కోసుకుంటున్న నాగరాజును అడ్డుకున్న పోలీసులు.. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించారు. ఇలా ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. బాధిత యువతి ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. నిందితుడు నాగరాజు ఎలక్ట్రీషియన్ గా వృత్తి చేసుకుంటున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.