జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫున సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైంది. బాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. అయితే రేపు మరోసారి SLP మెన్షన్ చేయాలని, దాని లిస్టింగ్ విషయం తర్వాత పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.
ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై విజయవాడ ACB కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో SLP వేశారు.