మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ(Skill Development) స్కాంలో అరెస్టయి 14 రోజుల రిమాండ్ అనుభవిస్తున్న ఆయన తరఫున.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ACB కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన తరఫు న్యాయవాదులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై రేపు విచారణ చేపట్టే అవకాశమున్నట్లు అక్కడి వర్గాలు అంటున్నాయి. నంద్యాలలో అరెస్టు చేసి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టడం సరికాదు అని అందులో పేర్కొన్నారు. బాబుకు ACB కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
రాజమండ్రి జైలులో ఉంటున్న ఆయనకు సరైన భద్రత లేదని, హౌజ్ అరెస్టును పరిశీలించాలంటూ మొన్న జస్టిస్ లూథ్రా పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకుందామనేలోపే నిన్న కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేయడం మీకు తెలియదా.. మధ్యాహ్నం 12 గంటల్లోపే వేయాలన్న పద్ధతిని మరచిపోయారా అంటూ కోర్టు అసహనం చెందింది. ఇలాంటి పరిస్థితుల్లో బాబు తరఫు లాయర్లు.. ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు.