ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి బెయిల్ కోసం ఎనలేని తిప్పలు పడుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు.. ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఆయనకు మధ్యంతర(Interim) బెయిల్ మంజూరు సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. మొన్నీమధ్య వాదనలు పూర్తయిన అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం(Bench).. ఈరోజు ప్రకటించింది.
మొన్న కూడా…
మే 10న ఇచ్చిన మధ్యంతర బెయిల్లో భాగంగా ఆయన CM ఆఫీస్ కు వెళ్లకూడదని షరతులు విధించింది. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించడంతో ఢిల్లీ CM మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 90 రోజుల గడువును పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇస్తున్నట్లు తెలిపిన బెంచ్.. కేజ్రీవాల్ వేసిన మిగతా పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
ఆయనదే నిర్ణయం…
ముఖ్యమంత్రిగా ఉండాలా, తప్పుకోవాలా అనేది కేజ్రీవాల్ సొంత నిర్ణయమ(Decision)ని జస్టిస్ సంజీవ్ ఖన్నా అభిప్రాయపడ్డారు. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధి విషయంలో తాము ఎలాంటి కామెంట్స్ చేయడం లేదని బెంచ్ స్పష్టం చేసింది.