చంద్రబాబుకు రిమాండ్ విధించిన ACB కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు మరో పిటిషన్ దాఖలు చేశారు. బాబు పరిస్థితి దృష్ట్యా ఆయనకు బెయిల్ ఇచ్చేలా ఆదేశించాలంటూ కోర్టును అభ్యర్థించారు. అయితే ACB కోర్టు న్యాయమూర్తి దీనిపై ప్రశ్నలు సంధించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా తమ వద్ద బెయిల్ పిటిషన్ ఎలా వేస్తారని అడిగారు. అయితే బెయిల్ పిటిషన్ పరిశీలించి లిస్టింగ్ ఇస్తామన్నారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.