అతడికి 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుంది.. ఆ సెంటర్ కు దగ్గర్లోనే బస్సు దిగాడు.. మాస్క్(Mask) ధరించిన(Wearing) ఆ వ్యక్తి అక్కణ్నుంచి నడుచుకుంటూ కేఫ్ లోకి ఎంటరయ్యాడు.. కౌంటర్ వద్ద ఇడ్లీరవ్వ ఆర్డర్ ఇచ్చి, తన వెంట తెచ్చుకున్న బ్యాగును అక్కడే చెత్త డబ్బా(Dust Bin) వద్ద వదిలి వెళ్లాడు. సరిగ్గా ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది.. నిన్న బెంగళూరు కేఫ్ లో చోటుచేసుకున్న బాంబు పేలుడుకు సంబంధించి నిఘా వర్గాలు గుర్తించిన విశేషాలివి.
కేఫ్ లోనే ఏడు నిమిషాలు…
సదరు దుండగుడు బాంబు పెట్టి వెళ్లేందుకు కేఫ్ లోకి వచ్చి ఏడు నిమిషాల(Minutes) పాటు అక్కడే ఉన్నాడు. బెంగళూరు కుందనహళ్లి రోడ్డులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలోగల రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు జరిగి 10 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. CC టీవీ ఫుటేజీల ద్వారా నిందితుణ్ని గుర్తించిన పోలీసులు.. ఘటనకు పాల్పడిన వ్యక్తిని 25-30 ఏళ్ల యువకుడిగా పోల్చారు. ఇందుకోసం AI(Aritificial Intelligence) టెక్నాలజీని ఉపయోగించి నిందితుడి ముఖ కవళికల్ని గుర్తు పట్టారు.
ప్రాణహాని లేదన్న ప్రభుత్వం…
కేఫ్ కు పక్కనే బస్సు దిగినప్పట్నుంచి బాంబు బ్యాగు పెట్టేవరకు జరిగిన పరిణామాల్ని CC టీవీ ఫుటేజీల ద్వారా గమనించారు. గాయపడ్డ వారిలో ఎవరికీ ప్రాణహాని లేదని కర్ణాటక డిప్యుటీ CM డీకే శివకుమార్ ప్రకటించారు. వైదేహి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితుల్ని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పరామర్శించారు. ఇప్పటికే ఈ ఘటనపై NIA, IB వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతోపాటు రాష్ట్రంలోని వివిధ పోలీస్ టీమ్ లు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి.