దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో మత్తుపదార్థాలు(Drugs) స్వాధీనం చేసుకున్నారు కోస్ట్ గార్డ్ అధికారులు. బంగాళాఖాతం(Bay Of Bengal) సమీపంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో 5 టన్నుల సరకు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ చరిత్రలో ఈ స్థాయిలో పట్టుబడటం ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు. నిఘా వర్గాల మేరకు మాటు వేసిన సిబ్బంది.. చేపల పడవపై దాడికి దిగారు.