ప్లాస్టిక్(plastic) తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి సీరియస్(serious)గా ఉన్నట్లు అక్కడివారు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లోని శ్రీనాథ్ రోటా ప్యాక్ ఇండస్ట్రీలో ఫర్నేస్ బ్లాస్ట్ జరిగింది. ఆ సమయంలో అందులో పనిచేస్తున్న వారు… ఈ పేలుడు ధాటికి చెలరేగిన మంటలతో తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను కంపెనీ మేనేజ్ మెంట్ వెంటనే షాద్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించింది. అయితే ఇందులో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో వారిని హైదరాబాద్ తరలించారు.
హైదరాబాద్ తరలించిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి కార్మికులు అంటున్నారు.